

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు: భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో70 సీట్లకు 48 సీట్లు సాధించి ఘనవిజయం సాధించింది.ఈ సందర్భంగా పట్టణ ములోని యనార్టీ సెంటర్లో భారతీయ జనతా పార్టీ జెండా వద్ద ఢిల్లీ అసెంబ్లీ విజయోత్సవం సభ జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు సీనియర్ నాయకులు పాల్గొని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్ర మోడీ, నడ్డా, జాతీయ నాయకుల కృషితో డిల్లీ అసెంబ్లీ భారీ మెజారిటీతో గెలవడం జరిగిందన్నారు. స్వీట్స్ పంచి , బాణసంచాలు కాల్చి విజయోత్సవం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట పట్టణ అధ్యక్షులు కోట పవన్ కుమార్ గాంధీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరంకుశం శ్రీనివాసరావు, పల్నాడు జిల్లా కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు, నియోజకవర్గ కన్వీనర్ టి. జయరామి రెడ్డి, నియోజకవర్గ కోకన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా మాజీ అధ్యక్షులు పోట్రు పూర్ణచంద్రరావు, ఆదిమూలం గురుస్వామి, అయితా వెంకటప్రసాద్, ఉండవల్లి కోటేశ్వరరావు, గుడిపల్లి నాగభూషణం, వెళ్లంపల్లి రాము,యన్. హనుమాన్ సింగ్, గట్ట హేమ, లక్ష్మీ కుమారి,రాజ్యలక్ష్మి, రాజ్యం, మాచర్ల శ్రీనివాసరావు, పుప్పాల రమాకాంత్, ఆవుల రామ కోటేశ్వరరావు, పొత్తూరి బ్రహ్మనందం,ఘంటసాల బంగారు బాబు, శ్రీరామ్ నారాయణ,అర్వపల్లి వేంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.