జనం న్యూస్, ఫిబ్రవరి 5తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ : శ్రీనివాస్ రెడ్డి
రైతుల గౌరవం, సంక్షేమమే లక్ష్యంగా సమాజంలో స్ఫూర్తిని నింపే కార్యక్రమాలు మరింతగా విస్తరించాలని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు గాదె శివ అన్నారు.శ్రీ సాయి అలేఖ్య ఆర్ట్స్ వారి ఆధ్వర్యంలో, బిగ్ టీవీ వారి సౌజన్యంతో నిర్వహించబడుతున్న “జై కిసాన్ 2026” కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రాన్ని ఆర్గనైజర్ అరుణ మరియు వారి మిత్రబృందం గాదె శివను కలిసి అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ వివరాలను ఆయనకు వివరించారుఈ మహత్తర కార్యక్రమంలో భాగంగా “రైతుకు వందనం” అనే శీర్షికతో సుమారు తొమ్మిది వేల మంది రైతు బిడ్డలతో కలిసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ స్థాయిలో ఈ నెల 28వ తేదీన హైదరాబాద్ లోని యల్.బి. స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
రైతుల గౌరవార్థం నిర్వహించనున్న ఈ అరుదైన కార్యక్రమాన్ని గాదె శివ హర్షాతిరేకాలతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల పట్ల గౌరవాన్ని చాటే ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి గొప్ప ప్రేరణగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.రైతుల సేవే దేశ సేవగా భావించి ముందుకు సాగుతున్న నిర్వాహకుల ప్రయత్నాలు అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలకు తనవంతు పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని గాదె శివ భరోసా ఇచ్చారు.


