

గ్రావెల్ దంద్దను అడ్డుకునేది ఏవరు
ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతర అధికారులు-గిరిజనేతర కాంట్రాక్టర్లదే దందా
వినతిపత్రం ఇచ్చిన స్పందించని వాజేడు తహసీల్దార్అ
క్రమ మోర్రం తొలకాలపై జిల్లా కలెక్టర్ స్పందించాలి-(ALF)రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల.సుమన్
జనంన్యూస్ బట్టా శ్రీనివాసరావు ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి ఐ టి ఐ కాలేజీ వెనకాల కూతవేటు దూరంలో తహసీల్దార్ కార్యాలయానికి సరిగ్గా 300మీటర్ల దూరంలో ఏజెన్సీ హక్కులు చట్టాలు అయిన పేసా చట్టాన్నీ నీరుగారుస్తూ ప్రభుత్వ భుములలో ఉన్న మోర్రంని ఏటూరునాగారం పట్టా క్వారీ ఇసుక ర్యాంపుకు అక్రమంగా భారీ వాహనాల ద్వారా తోలకలు జరుపుతున్నా ఏజెన్సీ ప్రాంతంలో హక్కులు చట్టాలను కుని చేస్తున్నా వాటిని కాపడవాల్సిన స్థానిక తహశీల్దార్ గారు ఏమాత్రం స్పందించకుండా ఉండటం ఇది ఎంత వరకు సమంజసమని అన్నారు ఏజెన్సీ ప్రాంతంలో పేసా గ్రామ సభ జరిగిన తర్వాతనే ఇసుక మోర్రం తొలకలు జరపాలని రాజ్యాంగ నిబంధనలు ఉన్నప్పటికి చట్టాలను అక్రమార్కుల చుట్టాలుగా మల్చుకొని అక్రమంగా తొలకాలు జరుపుతున్నా సదరు వ్యక్తుల మీద విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వెంటనే తొలకాలను నిలుపుదల చేయాలని ఆదివాసీ లిబరేషన్ ఫోర్స్(ALF)రాష్ట్ర అధ్యక్షుడు దబ్బకట్ల.సుమన్ డిమాండ్ చేశారు**GO.03 మైనింగ్ ప్రకారం పట్టా భూమూలలో ఇసుక తొలకాలు జరుపుతే మరల వ్యవసాయానికి అనుకూలంగా ఉంటేనే అనుమతులు ఇవ్వాలని GO.03లోని నిబంధన(7)తెలియజేస్తున్నప్పటికి ఏటూరునాగారం మానస పల్లి పట్టా భూముల పేరుతో ఇసుక అక్రమ తొలకపు అనుమతులు ఇచ్చిన అగ్రికల్చర్ అధికారి మీద జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని అన్నారు అధికారులు చర్యలు తీసుకొని పక్షాన ఆందోళన కార్యక్రమాలు చేపట్టాక తప్పదని ప్రభుత్వ అధికారులను హెచ్చరించారు.