Listen to this article

బిచ్కుందలో అందరిని ఆకట్టుకుంటున్న గోనె హన్మవ్వ

నిరుపేదలని అందలం ఎక్కించడమే నా ధ్యేయం : ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావ్

బిచ్కుంద ఫిబ్రవరి 5 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని బిచ్కుంద మునిసిపాలిటీ ఎన్నికల్లో ఆసక్తికర విషయాలు చోటు చేసుకుంటున్నాయి.బిచ్కుంద మొదటి వార్డు అభ్యర్థి గా కాంగ్రెస్ పార్టీ నుండి నిరుపేద దళిత కుటుంబానికి చెందిన గొనే హన్మవ్వ ని జుక్కల్ ఎమ్మెల్యే ఎంపిక చేయడం బిచ్కుంద రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.గత 40 సంవత్సరాలుగా బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ కి సేవలందించిన సీనియర్ కార్యకర్త గోనే గంగారం ఇటీవలే పరమవదించిన సంధర్భం లో, అతి నిరుపేద దళిత కుటుంబానికి చెందిన గోనె హన్మవ్వ కి బి-ఫారం ఇవ్వడం పట్ల పార్టీ శ్రేణులు, బిచ్కుంద ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.ఇంటింటి ప్రచారం లో గొనె హన్మవ్వ కి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నరు. ఎమ్మెల్యే ఎస్సీ జనరల్ స్థానం లో కూడా ఒక మహిళ కి అవకాశం ఇవ్వడం , బిచ్కుంద లో మొత్తం 12 వార్డుల్లో ఏడుగురిని మహిళలని బరిలోకి దించడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.కనీసం నామినేషన్ కి కూడా డబ్బులు లేని గోనె హన్మవ్వ ని అన్ని రకాలుగా ఆదుకుంటూ ప్రచారం లో అన్ని తానై వ్యవహరిస్తున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతా రావ్ గారిని ప్రజలు, రాజకీయ నాయకులు ప్రశంసిస్తున్నారు.బిచ్కుంద వోటర్లు గోనె హన్మవ్వ లాంటి నిఖార్సైన కార్యకర్తని, నిరుపేద లని గుండెల్లో పెట్టుకొని చేతి గుర్తు పై వోట్ వేసి భారీ మెజార్టీ తో గెలిపించాలని ఎమ్మెల్యే లక్ష్మి కాంతా రావ్ కోరారు.