Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 5, వికారాబాద్ జిల్లా

పరిగి మున్సిపల్ పరిధిలోని 5వ వార్డు బిఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి ఆకారపు గౌతమి రాజును ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కౌన్సిలర్ అభ్యర్థి ఆకారపు గౌతమీ రాజు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వాడు పరిధిలోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలన్నీ పట్టించుకోలేదన్నారు. ఐదో వార్డును అభివృద్ధి చేసి ఆదర్శంగా మారుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళలు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.