

✍️జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఫిబ్రవరి 8 రిపోర్టర్ సలికినిడి నాగరాజు ✍️శ్రీకాకుళంలో మూడు రోజులు పాటు జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర మహాసభలలో AIYF రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికైన CPI సుభాని,ఈ సందర్భంగా పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. తన విద్యార్థి దశ నుండే పేద విద్యార్థుల పక్షాన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించి , గత దశాబ్దన్నారా కాలంగా విద్యార్థుల పక్షాన రాష్ట్రంలోని నిరుద్యోగుల పక్షాన ప్రతి ఒక్క పేద విద్యార్థికి ఉచిత విద్య అందాలని, ప్రతి ఒక్క పేదవాడికి ఉచిత వైద్యం అందాలని, నిరుద్యోగులకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు కల్పించడమే ఎజెండాగా తీసుకొని ప్రజా ఉద్యమాల్లో ముందుండి కేవలం రాష్ట్ర , దేశ వ్యాప్త సమస్యలే కాకుండా మన చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు రైలు సదుపాయం కల్పించాలని పోరాటాలు చేస్తున్నా మన ప్రాంతానికి చెందిన CPI సుభాని ఫిబ్రవరి 6, 7, 8వ తేదీల్లో జరిగిన అఖిల భారత యువజన సమాఖ్య AIYF రాష్ట్ర 22వ మహాసభలలో రాష్ట్ర AIYF సహాయ కార్యదర్శిగా ఎన్నికవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.