

జనం న్యూస్ నడిగూడెం ,ఫిబ్రవరి 08 మండల పరిధిలోని సిరిపురం గ్రామానికి చెందిన డివైఎఫ్ఐ నాయకులు షేక్ సైదా హుస్సేన్(38) శనివారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతి పట్ల సిపిఎం మండల కార్యదర్శి బెల్లంకొండ సత్యనారాయణ, డివైఎఫ్ఐ కోదాడ డివిజన్ మాజీ అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు, శాఖ కార్యదర్శి పసుపులేటి వెంకటేశ్వర్లు, నాగమణి ,నాగుల్ మీరా తదితరులు పాల్గొని నివాళులర్పించి, సంతాపం తెలిపారు.