

అచ్యుతాపురం(జనం న్యూస్) పూడిమడక మాఘ పౌర్ణమి జాతర సందర్భంగా విద్యుత్ అంతరాయం ఉండకూడదు అనే ఉద్దేశ్యంతో చిప్పాడ 11 కేవీ విద్యుత్ లైన్ మైంట్ నెస్ పనుల కారణంగా పూడిమడక, చిప్పాడ, కొండపాలెం, కడపాలెం, పెద్దూరు, జాలరిపాలెం, పల్లిపేట, ఎస్సీ కాలనీకు రేపు ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ ఎం శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్‌కు అంతరాయం కలుగుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.