జనం న్యూస్ 06 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విశాఖకు చెందిన పంచాయతీరాజ్ రిటైర్డ్ ఎస్ ఈ కల్లేపల్లి శ్రీనివాసరావు నివాసాల్లో ఏ సీ బీ అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో విశాఖ, విజయనగరం, మన్యం, హెచ్ వై డి లోని ఇళ్లల్లో దాడులు చేశారు. 3 ప్లాట్లు, 2 ఫ్లాట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమి, రూ.62 లక్షల నగదు, 2.5 కేజీల బంగారం, 20 కేజీల వెండి, ఇల్లు, కారు, బైక్ ఇల్లీగల్‌గా కలిగి ఉన్నట్లు గుర్తించి సీజ్ చేశారు.


