సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ బి వీరేశం జనం న్యూస్ ఫిబ్రవరి 06. 02. 2026
చూపిస్తున్నారు. పట్టణంలోని ప్రతి వీధి ప్రతి కాలనీ ప్రతి ఇంటిని కలుపుకుంటూ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో నేరుగా మాట్లాడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి గతంలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, పట్టణానికి అందించిన మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలను వివరంగా ప్రజలకు తెలియజేస్తూ మరోసారి బి.ఆర్.ఎస్ కి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పెద్ద బాయ్ మైపాల్ ప్రచారానికి స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో మద్దతుగా నిలుస్తూ కలిసి నడుస్తున్నారు. ప్రజల సమస్యలను దగ్గరగా విని పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇస్తూ భవిష్యత్తులో జహీరాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తానని మైపాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన సరళమైన మాట తీరు, ప్రజలతో మమేకమయ్యే విధానం ఓటర్లను ఆకట్టుకుంటుండగా బి.ఆర్.ఎస్ పార్టీకి పట్టణంలో అనుకూల వాతావరణం ఏర్పడుతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. డోర్ టు డోర్ ప్రచారంతో పెద్ద బాయ్ మైపాల్ రోజురోజుకు ప్రజల్లో మరింత ఆదరణ సంపాదించుకుంటూ విజయ దిశగా దూసుకెళ్తున్నారని పార్టీ శ్రేణులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.



