సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ బి వీరేశం జనం న్యూస్ జహీరాబాద్,ఫిబ్రవరి 6:
జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 8న ఉదయం 6గంటలకు సాయిరాం కాలనీలోని పోచమ్మ ఆలయ ప్రాంగణంలో 193వ నగర సంకీర్తన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంస్థ బాధ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. హరేకృష్ణ మహామంత్ర జపం, ప్రభుపాదుల వారి ప్రార్థన, శ్రీకృష్ణ కీర్తనలతో శోభాయాత్ర, పిమ్మట సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ మందిరం ప్రతినిధుల ద్వారా శ్రీమద్భగవద్గీత ప్రవచనం, ఈ ప్రవచన కార్యక్రమం లో సాంఖ్యయోగం లోని శ్లోకాలపై విశ్లేషణ, శ్రీ లక్ష్మి నరసింహ ఆరతి అనంతరం ప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై నగర సంకీర్తన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.


