గ్రూప్ 2 పరీక్షల్లో ఉద్యోగాలు సాధించిన సురేష్, జయసూర్య లకు ఘన సన్మానం
కందుకూరు,
జనం న్యూస్, విద్య జీవితాన్ని
మార్చింది అనడానికి పరుసు సురేష్, దమ్ము జయసూర్య లే నిదర్శనమని నల్లదలపూరు ప్రధానోపాధ్యాయులు బీరకాయల మాధవరావు ఉన్నారు. ఈమధ్య విడుదలైన గ్రూప్ 2 కందుకూరు నియోజకవర్గానికి చెందిన పరసు సురేష్ సబ్ రిజిస్టర్ గా, దమ్ము జై సూర్య ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా ఎంపికయ్యారు. వీరిరువులను నల్లదలపూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు బీరకాయల మాధవరావు ఆధ్వర్యంలో వీరిని ఘనంగా సన్మానించారు. గ్రూప్ టు లో ఉద్యోగాలు సాధించిన సురేష్, జయ సూర్య మాట్లాడుతూ తాము పేదరికరంలో ఉన్న కుటుంబం నుంచి వచ్చి కష్టపడి చదువుకొని మంచి ఉద్యోగాలు సాధించామని, పాఠశాల విద్యార్థులు కూడా కష్టపడి చదివి మంచి ఉన్నత స్థితికి ఎదగాలని, వారి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకుని రావాలని వారు సూచించారు. అనంతరం వారిరువులను పాఠశాల సిబ్బంది గ్రామస్తులు ఘనంగా సన్మానించారు.


