జనంన్యూస్. 06.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాద్ వినాయక నగర్ 6 వ డివిజన్ కార్పొరేషణ్ బిజెపి అభ్యర్థి గోపిడి స్రవంతి రెడ్డి . ప్రతి ఇంటి గడపగడపకు తిరిగి తమదైన పద్ధతిలో ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ ను.. ఇందురు..గా మారుస్తామని. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు తమది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని ప్రతి ఇంటికి ఏదో రకంగా బిజెపి పథకాలు చేరాయని ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా మహిళలకు పెద్దపీట వేసిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని. ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని స్థానిక. పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్. స్థానిక అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ. వారి మద్దతుతో మున్సిపల్ కార్పొరేషన్ ఆరవ డివిజన్లో గెలిస్తే మనకు మేయర్ అయ్యే ఛాన్స్ ఉందని. తనకు ఓటర్ల మీద పూర్తి తమకు నమ్మకం ఉన్నదని గత పది సంవత్సరాలలో మహిళలకు విజయం అందించిన ఘనత ఈ వినాయక నగర్ మహిళలేనాని తెలిపారు. మీ అందరి ఆశీస్సులు తమకు ఉన్నాయని బీజేపీ పెద్దలతో తమకు ఉన్న పరిచయాలతో డివిజన్ ను నిజామాబాదు కార్పొరేషన్ లో మొదటి స్థానం లో ఉంచడానికి అన్ని విధాల అభివృద్ధి కి ప్రయత్నం చేస్తామని తాము స్థానికంగానే నివసించే వారామని కష్టసుఖాల్లో 24 గంటలు తోడుండే వారమని ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వమని కోరారు ప్రస్తుతం కేంద్రం లో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని అన్ని విధాల ప్రయత్నం చేసి నిధులు తీసుకువచ్చి వినాయక నగర్ ఆరవ డివిజన్ ను రోడ్లు డ్రైనేజ్ త్రాగునీరు దేనికి లోటు లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు దయచేసి మీ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు వేసి గెలిపించగలరని ఓటర్లను అభ్యర్థించారు.



