

జనం న్యూస్ ఫిబ్రవరి 09 మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్ మునగాల మండల పరిధిలోని నరసింహుల గూడెం ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు అని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ .విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితే ఉన్నత శిఖరాలు చేరవచ్చని అన్నారు.విద్యార్థులు నైతిక విలువలు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అభ్యసించాలని విద్య ఒక్కటెే మనల్ని సమాజంలో ఉన్నత స్థాయిలో నిలబెట్టగలదని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయ వేషధారణ విద్యార్థులకు బహుమతులు అందజేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.