జనం న్యూస్ ఫిబ్రవరి 6 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ
84 వ వార్డులో కార్పొరేటర్ చిన్న తల్లి ప్రతిపాదించిన పనులకు 5 కోట్లు జీవీఎంసీ నిధులు మంజూరు చేశారని 84వ వార్డు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మాదంశెట్టి నీలబాబు తెలియజేశారు. 84వ వార్డులు కార్పొరేటర్ గా చిన్నతల్లిని ఆదరించి అభిమానించి జీవీఎంసీ ఎన్నికల్లో గెలిపించినందుకు వార్డు ప్రజలు ప్రతిపాదనలు ఇప్పటివరకు 50 కోట్ల నిధులతో పనులు చేపట్టడం జరిగిందని, ఇప్పుడు మరలా 5 కోట్లతో ప్రతిపాదించిన పనులకు శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు అనకాపల్లి నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జ్ పీలా గోవింద సత్యనారాయణ సహాయ సహకారాలతో జీవీఎంసీ నుండి నిధులు మంజూరు కి సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, రింగ్ రోడ్డులో రోడ్డు విస్తరణ పనులకు గతంలో 1.40 కోట్లు మంజూరు చేసినవి కాకుండా ఇప్పుడు మరలా 2 కోట్లు తో అభివృద్ధి చేయడానికి, ఎప్పటినుండో కొండ కొప్పాక ప్రజలు అభ్యర్థన మేరకు కళ్యాణమండపం రెండు కోట్లు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి అనుమతించడం జరిగిందని, పెరుగు బజారు నుండి స్టేషన్ రోడ్డు వరకు సెంట్రల్ లైటింగ్ మరియు 10 రింగ్ పోల్స్, బైపాస్ జంక్షన్ నుండి శారదా బ్రిడ్జి వరకు ఎలక్ట్రికల్ పోల్స్ కు జాతీయ రంగులు వేయడానికి నిధులు మంజూరు చేశారని నీలబాబు అన్నారు. ప్రజల సహకారంతో నిరంతరం కార్పొరేటర్ చిన్న తల్లి తరచు వార్డు పర్యటన చేసి, కూటమి ప్రభుత్వం లక్ష్యాలను, అభివృద్ధి పనులను, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటూ, ప్రజలకి వివరిస్తూ పి హెచ్ సి ల ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యల కోసం కావలసిన ఏర్పాట్లు, పరిశీలించి స్థానిక నాయకుల దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయడం జరుగుతుందని, ప్రతి ఇంటికి ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించి దోమల నివారణ కోసం ప్రజలకు వివరించి, ప్రతి ఇంటికి దోమ తెరలు పంపిణీ చేశామని, కూటమి ప్రభుత్వం సహకారంతో రానున్న రోజుల్లో 84 వ వార్డులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలు సహకారంతో సాధిస్తామని, నీలబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో 84 వ వార్డు వార్డు టిడిపి అధ్యక్షులు తలారి ప్రసాదు దానబోయిన నీలకంఠం తదితరులు పాల్గొన్నారు


