Listen to this article

జనం న్యూస్ ; 6 ఫిబ్రవరి శుక్రవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;సిద్దిపేట

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సి బి సి ఎస్ సెమిస్టర్–1, 3 మరియు 5 పరీక్షల తేదీలను మారుస్తూ యూనివర్సిటీ పరీక్షల విభాగం నిర్ణయం తీసుకుంది.
ఫిబ్రవరి 7, 2026 నుండి నిర్వహించాల్సిన డిగ్రీ పరీక్షలను ఫిబ్రవరి 17, 2026 నుండి నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ అధికారులు తెలిపారు. ఈ మేరకు సంబంధిత విద్యార్థులకు సమాచారం అందించారు.
రీషెడ్యూల్ చేసిన పరీక్షల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:డిగ్రీ సెమిస్టర్–5 పరీక్షలు: ఫిబ్రవరి 17, 2026 నుండి ఫిబ్రవరి 22, 2026 వరకుడిగ్రీ సెమిస్టర్–3 పరీక్షలు: ఫిబ్రవరి 24, 2026 నుండి మార్చి 2, 2026 వరకు
డిగ్రీ సెమిస్టర్–1 పరీక్షలు: మార్చి 4, 2026 నుండి మార్చి 10, 2026 వరకు అలాగే, హాల్ టికెట్లు పరీక్ష తేదీకి రెండు రోజుల ముందుగా www.braouonline.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ విషయాన్ని డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, సిద్దిపేట రీజినల్ కోఆర్డినేటర్ డా. ఎం. శ్రద్ధానందం తెలిపారు.