Listen to this article

జనం న్యూస్ 07 ఫిబ్రవరి వికారాబాద్ జిల్లా

వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 32వ వార్డులో భారత రాష్ట్ర సమితి (BRS) బలపరిచిన అభ్యర్థి స్వరూప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది.ఇంటింటి ప్రచారంలో భాగంగా స్వరూప కాలనీ వాసులను ప్రత్యక్షంగా కలుసుకుంటూ, గతంలో BRS ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు, రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ, పేదల సంక్షేమంపై ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా స్వరూప మాట్లాడుతూ, ప్రజల నమ్మకంతో గెలిచి 32వ వార్డు అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తానని హామీ ఇచ్చారు. BRS పార్టీని మరోసారి ఆశీర్వదించి గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు, మహిళా విభాగం నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ జెండాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.