

జనం న్యూస్ ఫిబ్రవరి 9 : శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి మండలంలోని పత్తిపాక గ్రామంలో ఇటీవల వేట ప్రయత్నాలు చేసిన వేటగాళ్ల నుండి వేట సామాగ్రీ స్వాధీనం చేసుకొని శనివారం హనుమకొండ జిల్లా అటవీ శాఖ డిప్యూటీ రేంజర్ ఆఫీసర్కు మైసయ్యకు ఉడుతలను, పక్షులను వేటాడే వేట సామాగ్రి వళలను, స్పాంజీలను అందజేసినట్లు ఓరుగల్లు వైల్డ్ లైఫ్ సొసైటీ హనుమకొండ జిల్లా సభ్యులు మారెపల్లి సునిల్ తెలియజేశారు. ఈ సందర్భంగా రేంజర్ మైసయ్య మాట్లాడుతూ రెండవ సారి మళ్లి వేటగాళ్లు వేట సామాగ్రీతో పట్టుపడితే వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం కేసులు నమోదు చేసి జైలు పంపుతామని హెచ్చరించారు.