

జనం న్యూస్ ఫిబ్రవరి 9 : శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చైత్రశ్రీ ఫౌండేషన్ కెనడా వారు శనివారం 5 డబుల్ డెస్క్ బేంచీలను బహుకరించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వనం వెంకటేశ్వరరావు చైత్రశ్రీ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు మార్గం రమకు అభినందనలు తెలిపారు. అనంతరం ఫౌండేషన్ తరుపున ప్రాతినిధ్యం వహించిన భాగ్యలక్ష్మి, సంధ్యారమేష్ దంపతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.