Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 7 ముమ్మిడివరం ప్రతినిధి గాంధీ నానాజీ కాట్రేనికోన

మహా శివరాత్రి సందర్భంగా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ సభ్యులకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహూల్ మీనా సూచించారు,కాట్రేనికోన మండల పరిధిలో బ్రహ్మ సమేధ్యం పంచాయతీ శివారు మాగసాని తిప్పలో వేంచేసి యున్న ఆలయంలో మహా శివరాత్రి సందర్బంగా ఈ నెల 15న జరగనున్న తీర్ధ మహోత్సవం సందర్బంగా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలో భాగంగా డా.బి ఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా ఎస్పీ ముఖేష్ కుమార్ మీనా పరిశీలించారు.బలుసుతిప్ప నుండి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోటులో ప్రయాణించి మగసాని తిప్ప చేరుకొని తీర్ధం జరిగే ప్రదేశాన్ని పరిశీలన చేశారు.ఈ సందర్బంగా స్థానిక పరిస్థితిని ఎస్ఐ అవినాష్ తెలియ జేశారు.ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని,బొట్లుపై ప్రయాణం చేయు సందర్భంలో తప్పని సరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని,
సామర్థ్యం మేరకు మాత్రమే ప్రయాణికులను చేర వేయాలని ఆలయ కమిటీ సభ్యులకు తగిన చర్యలు తీసుకోవాలని సూచనలు చేశారు.మాగసానితిప్ప గోదావరి రేవులో భక్తులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో అమలాపురం డిఎస్పి టి ఎస్ ఆర్ కే ప్రసాద్,ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్, తహసిల్దార్ రవి కిరణ్, ఎంపీడీవో బి రాజేశ్వర రావు,ఎస్ఐ అవినాష్ పోలీస్ రెవిన్యూ పంచాయతీ సిబ్బందితో పాటు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు