Listen to this article

జనం న్యూస్‌ 09 ఫిబ్రవరి, విజయనగరం టౌన్‌ రిపోర్టర్‌ గోపికృష్ణ పట్నాయక్‌

రాజాంలో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రి వద్ద ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మండలంలోని గురవాం గ్రామానికి చెందిన 10వ తరగతి చదువుతున్న కుప్పిలి ప్రవళిక అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆదివారం హాస్పిటల్‌లో చేర్పించారు. సమయానికి చికిత్స అందక పోవడంతోనే బాలిక మరణించిందని ఆసుపత్రి ఎదుట బాలిక బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి సిబ్బంది, డాక్టరు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబీకులు ఆరోపించారు.