Listen to this article

జనంన్యూస్. 09.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.

కేంద్ర బిజెపి ప్రభుత్వం చేసిన 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, విద్యుత్తు సవరణ చట్టం – 2025, వి బి – రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ ఐ సి లో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించాలని కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు 2026 ఫిబ్రవరి 12 వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ, ది:09-02-2026న, సిరికొండ మండల కేంద్రంలో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) ఆధ్వర్యంలో పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా TUCI రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ మాట్లాడుతూ, కార్మికులు వీరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా సంపన్నుల మెప్పుకోసమే, మేలు కోసమే పని చేస్తున్నారు అన్నారు. ప్రధాని మోడీ తుగ్లక్ నిర్ణయాల వల్ల రూపాయి విలువ రోజు రోజు పడిపోయింది అన్నారు. దేశ జీడిపి క్షిణించి దేశం మొత్తం దరిద్ర రేఖకు దిగువన పడిపోయి పేదలు అన్నామో రామచంద్ర అనాల్సిన దుస్థితి నెలకొన్నది అన్నారు. కార్మికులు, కర్శకులు పోరాడి సాదించుకున్న హక్కులను హరించి బానిసలుగా మర్చివేస్తున్నారు అన్నారు. కాబట్టి కార్మికులు, కర్షలు, అశేష ప్రజానీకం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది అన్నారు.ఈ కార్యక్రమంలో టియుసియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం అనిస్, జిల్లా నాయకులు ఎస్ కిశోర్, మండల అధ్యక్షులు కె రాజన్న, మండల నాయకులు ఎన్ శంకర్, ఎస్ బాలకిషన్,ఎం సలీమ్, జి లింగం, ఎన్ లింబాద్రి, డి సుధాకర్ ఎ కాశీరం తదితరులు పాల్గొన్నారు.