Listen to this article

జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ గురజాడా గ్రంధాలయంలో నిరుద్యోగులు నిర్వహించిన సమావేశంలో డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించి సకాలంలో పోస్టులు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ నీ విడుదల చేయాలని రాష్ట్ర కార్యదర్శి జి రామన్న తెలిపారు. డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ అధ్యక్షత వహిస్తూ ముఖ్య వక్తగా భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డివైఎఫ్ఐ )రా రాష్ట్ర కార్యదర్శి జి .రామన్న మాట్లాడుతూ . కూటమి ప్రభుత్వం అధికారం లోకి రాగానే డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చింది అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేయడంతో నిరుద్యోగులు విసిగి ఉద్యోగాల కోసం, మార్పు కోసం రాష్ట్రంలోని నిరుద్యోగులు గంపగుత్తగా కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించడానికినిరుద్యోగులు కీలక పాత్ర వహించారు.సూపర్ సిక్స్ హామీల భాగంగా మెగా డీఎస్సీ సంతకం చేశారు కానీ.. నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగ మోసం చేస్తున్నారు వెంటనే డీఎస్సీ సకాలంలో పోస్టులు భర్తీ చేయాలి. గత ప్రభుత్వ ము లోసచివాలయం. వైద్యశాఖలో నింపుతున్న ఆవి కాంట్రాకట్ట పద్దతిలోనే. ఎపిపిఎస్సీ ద్వారా 10,143 పోస్టలు భర్తీ చేస్తామని 2021జూన్ 18న జాబ్ క్యాలండర్ విడుదల చేసింది . దీనిపై నిరుద్యోగ యువతలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అలాగే గత ప్రభుత్వా లయంలో 6100 కానిస్టేబుల్ పోస్టులకు రెండేళ్ల తర్వాత దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించరు..వెంటనే ప్రైమరీ పరీక్ష నిర్వహించాలని మాట్లాడారు. నిరుద్యోగుల కోసం నిరంతరం పోరాడుతూ అహర్నిశలు కష్టపడుతున్న పిడిఎఫ్ ఎమ్మెల్సీలును గెలిపించాలి . శాసనసభకు పంపించాలని కోరారు ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సతీష్, నిరుద్యోగులు పాల్గొన్నారు