Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 9తెలంగాణ స్టేట్ ఇన్‌చార్జి : శ్రీనివాస్ రెడ్డి

వెస్ట్ సాయి నగర్, ఆల్విన్ కాలనీలోని మహా బోధి ప్రీ స్కూల్ తృతీయ వార్షికోత్సవ వేడుకలు వివేకానంద నగర్‌లోని వివేకానంద అపార్ట్మెంట్స్ కమ్యూనిటీ హాల్ లో ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని స్కూల్ డైరెక్టర్ గుందడి రవీందర్ కుమార్, ప్రిన్సిపల్ లావణ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రామకృష్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జనంపల్లి పురంధర్ రెడ్డి, వెస్ట్ సాయి నగర్ అధ్యక్షులు జి. ప్రభాకర్, ఫర్ బెటర్ సొసైటీ ఫౌండర్ అధ్యక్షులు దశమంతరావు పాల్గొని కార్యక్రమాన్ని మరింత శోభాయమానంగా నిలిపారు.ఈ సందర్భంగా జనంపల్లి పురంధర్ రెడ్డి మాట్లాడుతూ, “మహా బోధి ప్రీ స్కూల్ ఫౌండర్ రవికుమార్, ప్రిన్సిపల్ లావణ్య ఆధ్వర్యంలో చిన్నారులకు విద్యతో పాటు ఆటపాటలు, క్రీడల ద్వారా ఉత్సాహభరితమైన వాతావరణంలో విద్యాబోధన జరుగుతోంది. ముఖ్యంగా చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ మంచి గుణగణాలు అలవర్చడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయం” అని ప్రశంసించారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, చిన్నారులకు, తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ, స్కూల్ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.అనంతరం డైరెక్టర్ గుందడి రవికుమార్ మాట్లాడుతూ, “మా స్కూల్‌లో చదువుతున్న చిన్నారులను కంటికి రెప్పలా కాపాడుతూ, విద్యతో పాటు ఆటపాటల ద్వారా మానసికంగా ఉత్సాహంగా ఉండేలా శిక్షణ అందిస్తున్నాం. చిన్నారుల భవిష్యత్తుకు పటిష్టమైన ఫౌండేషన్ వేయడమే మా లక్ష్యం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, మిత్రులు, పెద్దలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ లావణ్య కూడా మాట్లాడుతూ, స్కూల్ అభివృద్ధికి సహకరిస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.కార్యక్రమంలో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకలు ఆనందోత్సాహాల మధ్య విజయవంతంగా ముగిశాయి.