

జనం న్యూస్ 09 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ ; విజయనగరంలోని కలెక్టర్ కార్యాలయ సమీపంలో పశు మాంసం అమ్మే వ్యాపారస్తులతో 1వ పట్టణ పోలీసులు శనివారం సమావేశం నిర్వహించారు. ట్రేడ్ లైసెన్సుతో పాటు అన్ని అనుమతులు ఉన్నవారు మాత్రమే పశు మాంసాన్ని విక్రయించాలని, అనుమతులు లేకుండా పశువులను వధించడం, రవాణా చేయడం చట్ట ప్రకారం నేరమన్నారు. చట్ట వ్యతిరేకంగా పశువుల వధించడం, రవాణా చేసినట్లయితే వారిపై కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు.