ఫిబ్రవరి 12న
జరిగే అఖిలభారత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఉప్పల్ పారిశ్రామిక వాడలో ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ఐ ఎన్ టి యు సి నాయకులు ప్రకాష్ రెడ్డి సిఐటియు నాయకు లు జే వెంకన్న వెంకటేష్ ఊర్మిళ స్వామి వై వెంకటేశ్వర్లు అంజి సయ్యద్ జిలాని ఏఐటీయూసీ నాయకులు పరమేష్ జగ్గారెడ్డి బి.ఆర్.టి.యు నాయకులు సైదులు టి యు సి ఐ నాయకులు గడ్డం సదానందం అఫ్జల్ యాకస్వామి నాగలక్ష్మి తదితరులుపాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్స్ ను తీసుకువచ్చి కార్మిక హక్కుల ను కాలరాసే ప్రయత్నం చేస్తోందని, రాజ్యాంగబద్ధ, ప్రజాస్వామ్య బద్ద హక్కుగా కార్మికుల సమ్మె చేసే హక్కును కాల రాస్తుందని, కార్మికులు తమ సమస్యలు పరిష్కారానికి కార్మిక వివాదాల చట్టం ద్వారా లేబర్ ఆఫీస్ కి వెళ్లి న్యాయం పొందే ప్రయోజనాన్ని కూడా రద్దు చేసిందన్నారు.కాబట్టి కార్మిక వర్గం పెద్ద ఎత్తున లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు ఉద్యమించాలని కోరారు.మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు వ్యతిరేక చర్యలపై విధానాలపై పోరాడాల్సిన బాధ్యత కర్తవ్యం కార్మిక వర్గంపై ఉందని అన్నారు. ఈరోజు విత్తన చట్టం పేరుతో కార్పొరేట్ కంపెనీలకు సేవ చేసే బిల్లుని ఆమోదింప చేయడం, కనీసం 26,000 ఇవ్వాలని , ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు వ్యవస్థను పర్మినెంట్గా కొనసాగించి కార్మికులు యజమానులు ఊడిగం చేసే సేవకులుగా మార్చే చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అన్నారు. ఒకవైపు కార్మికులు తమను రెగ్యులర్ చేయాలనే డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం పర్మినెంట్ ఉద్యోగాలు లేకుం డా చెబితే ప్రయత్నాలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.కావున కార్మికులు ఫిబ్రవరి 12 న జరుగు దేశ వ్యాప్త సమ్మెలో అధిక మొత్తంలో కార్మిక వర్గం పాల్గొనాలని పిలుపునిచ్చారు.


