Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 9 జనం న్యూస్

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు బిచ్కుంద ఎస్సై రాజు హెచ్చరిక బిచ్కుంద మున్సిపాలిటీ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. మున్సిపాలిటీలోని 12వార్డుల్లో గత కొన్ని రోజులుగా హోరెత్తిన ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5:00 గంటలతో తెరపడనుంది. ఈ నేపథ్యంలో గద్వాల పట్టణ ఎస్సై రాజు అభ్యర్థులకు, రాజకీయ నాయకులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.నిబంధనలు అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున, ప్రచార గడువు ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు లేదా ప్రచార కార్యక్రమాలు నిర్వహించకూడదని ఎస్సై స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ప్రచారం సాగించే అభ్యర్థులు, వారి అనుచరులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.స్థానికేతరులు పట్టణం విడిచి వెళ్లాలి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచార గడువు ముగియగానే, ఓటు హక్కు లేని ఇతర ప్రాంతాల వారు వెంటనే సొంత ఊర్లకు వెళ్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని , కమ్యూనిటీ హాళ్లలో తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా బస చేస్తే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.