Listen to this article

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా.

నేడు పార్లమెంట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్ (JJM) అమలుపై స్వస్థత కోరిన వైయస్సార్ సీపీ ఎంపీ మేడా రఘునాథ రెడ్డి ఇంటి నీటి కనెక్షన్ల పురోగతి జల్ జీవన్ మిషన్ ప్రారంభమైన ఆగస్టు 2019 నాటికి కేవలం 30,74,310 గ్రామీణ ఇళ్లకు (32.18%) మాత్రమే నల్లా నీటి కనెక్షన్లుఉన్నాయి.మిషన్ అమలులోకి వచ్చిన తర్వాత అదనంగా 40,78,016 ఇళ్లకు నల్లా నీటి కనెక్షన్లు అందించ బడ్డాయి.06.02.2026 నాటికి రాష్ట్రంలోని 95,53,169 గ్రామీణ ఇళ్లలో 71,52,326 ఇళ్లకు (74.87%) నల్లా నీటి కనెక్షన్లు పూర్తయ్యాయి.బాధ్యత రాష్ట్రాలదే – కేంద్రం సహకారం తాగునీరు రాష్ట్ర పరిధిలోని అంశం కావడంతో ప్రణాళిక, అమలు, నిర్వహణ బాధ్యతలు రాష్ట్ర ప్రభు త్వానివే.అయితే కేంద్ర ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తూమద్దతుగానిలుస్తోంది.నిధుల కేటాయింపు – వినియోగం జల్ జీవన్ మిషన్ కింద 2019-20 నుండి 2025-26 వరకు ఆంధ్రప్రదేశ్‌కు రూ.16,855.66 కోట్లు కేంద్ర వాటాగా కేటాయింపు జరిగింది.ఇందులో రూ.2,324.89 కోట్లు నిధులు ఉపసంహరించుకోగా రూ.2,316.42 కోట్లు వ్యయం చేయబడింది.నీటి నాణ్యత – ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు ప్రాధాన్యం ఫ్లోరైడ్ వంటి రసాయన కాలుష్యంతో ప్రభావిత ప్రాంతాలకు జల్ జీవన్ మిషన్‌లో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది.సురక్షిత ప్రత్యామ్నాయ నీటి వనరులతో పైప్ నీటి సరఫరా పథకాలు అమలు చేయాలని రాష్ట్రాలకుసూచనలు.తాత్కాలికంగా సముదాయ నీటి శుద్ధి కేంద్రాలు (CWPPs) ఏర్పాటు చేసివ్యక్తికి రోజుకు 8–10 లీటర్ల శుద్ధి నీరు అందించేలా చర్యలు.సాంకేతిక మార్గ దర్శకాలుకేంద్ర ప్రభుత్వం త్రాగు నీరు ట్రీట్మెంట్ టెక్నాలజిస్ హ్యాండ్‌బుక్ (మార్చి 2023)వాటర్ క్వాలిటీ మానిటరింగ్ హ్యాండ్ బుక్ (డిసెంబర్ 2024) విడుదల చేసింది.ఇవి ఫీల్డ్ స్థాయి అధికారులకు ప్రాయోగిక మార్గనిర్దేశం చేస్తాయని తెలిపింది.జల్ జీవన్ మిషన్ పొడిగింపు సాధించిన పురోగతిని దృష్టిలో ఉంచుకొనిజల్ జీవన్ మిషన్‌ను డిసెంబర్ 2028 వరకుపొడిగించారు.2025-26 బడ్జెట్‌లోమొత్తంవ్యయాన్ని పెంచినట్లు కేంద్రం వెల్ల డించింది. మొత్తంగా, ఆంధ్రప్రదేశ్‌లో జల్ జీవన్ మిషన్ కింద నల్లా నీటి కనెక్షన్లలో గణనీయమైన పురోగతి సాధించామని, నీటి నాణ్యత సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టామని కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో జల్ శక్తి శాఖ సహాయ మంత్రి వి. సోమన్న లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.