జనం న్యూస్ 10 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
కురుపాం మండలం నీలకంఠాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత బాలుర పాఠశాలలో ఫేర్వెల్ డే సందర్భంగా అశ్లీల నృత్యాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. మంత్రులు లోకేశ్, సంధ్యారాణి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు దర్యాప్తు చేశామని డిప్యూటీ విజయశాంతి తెలిపారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆదేశాల మేరకు సంబంధిత వార్డెన్ చంద్రమోహను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు


