Listen to this article

బిచ్కుంద ఫిబ్రవరి 10 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీ రేపు జరగబోయే ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినామని ప్రత్యేక అధికారి జెడ్పి సీఈఓ చందర్ నాయక్ తెలిపారు. బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డ్ కౌన్సిలర్ గాని 12579 ఓటర్లు ఉన్నారు. మొత్తం 24 పోలింగ్ స్టేషన్లు, 4 ఆర్ ఓ,4 ఏ ఆర్ ఓ లు మొత్తం పోలింగ్ సిబ్బంది 142 ఎన్నికల నిధులు నిర్వహిస్తున్నారు .మొత్తం 100 మంది పోలీస్ సిబ్బంది పాల్గొంటున్నారు.నలుగురు సిఐలు నలుగురు ఎస్ఐలు ఆధ్వర్యంలో బంధాబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.సాయంత్రం వరకు పోలింగ్ స్టేషన్కు ఎన్నికల సామాగ్రి తో పాటు అధికారులు పోలీస్ సిబ్బంది చేరుకుంటారని తెలిపారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. వీరితోపాటు మున్సిపల్ కమిషనర్ షేక్ హయూమ్,ఎమ్మార్వో వేణుగోపాల్, డిప్యూటీ ఎమ్మార్వో భరత్, మున్సిపల్ సిబ్బంది శ్రీనివాస్ తదితరులు ఎన్నికల ఏర్పాట్లు పాల్గొన్నారు.