మండల వ్యవసాయ అధికారి రాజు
మద్నూర్ ఫిబ్రవరి 10 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్దునూర్ మండల కేంద్రంలోని మంగళవారం రోజు రైతు వేదిక యందు యూరియా యాప్ మీద రైతులకు మరియు ఫర్టిలైజర్ డీలర్లకు మండల వ్యవసాయ అధికారి రాజు అవగాహన కల్పించడం జరిగింది.ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ను రైతులు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని పట్టా పాస్బుక్ కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యాక యూరియా బుక్ చేసుకోవచ్చును.
ఒకవేళ మొబైల్ నెంబర్ లింక్ లేకుంటే సంబంధిత గ్రామ ఏఈవో దగ్గర మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకొని యూరియా బుక్ చేసుకోవచ్చును.ఒకవేళ యాప్ గురించి తెలియక ఫర్టిలైజర్ షాప్ కి యూరియా కోసం వచ్చిన సంబంధిత దుకాణ డీలర్ వారి యొక్క మొబైల్ నుంచి కూడా అప్పటికప్పుడు రైతులకు యూరియా బుక్ చేసి యూరియా ఇవ్వబడును.మండల రైతులు యూరియా కోసం వచ్చే ముందు స్లాట్ బుక్ చేసుకొని ఫర్టిలైజర్ షాప్ కి వెళ్లాలని విజ్ఞప్తి.ఒకసారి యూరియా బుక్ చేసుకుంటే 24గంటల వరకు బుక్ చేయబడి ఉంటుంది. 24తర్వాత గంటల తరవాత బుక్ చేసుకున్న యూరియా తీసుకోకపోతే స్లాట్ క్యాన్సల్ అవుతుంది . మళ్ళీ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.కార్యక్రమంలో ఏఈవో సౌమ్య , సరోజ , ఫర్టిలైజర్ డీలర్లు, రైతులు పాల్గొన్నారు.




