జనం న్యూస్ ; 10 ఫిబ్రవరి మంగళవారం :సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై.రమేష్ ;
ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్.ఎస్.ఎస్ యూనిట్ 2 ఆధ్వర్యంలో చందు లాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలోని రెండవ రోజు కార్యక్రమాల్లో భాగంగా చంద్లాపూర్ గ్రామంలోని స్కూల్ పరిసరాలను గ్రామంలోని మురికివాడలను వాలంటీర్లు పరిశుభ్రం చేశారు.ఎన్ ఎస్ ఎస్ కార్యక్రమాదికారి డాక్టర్ ఎన్ హరిబాబు మాట్లాడుతూ వాలంటీర్లు స్కూలు పరిసరాలను శుభ్రం చేశారని మరియు గ్రామంలోని ఎంపిక చేసిన మురికివాడాలను కూడా శుభ్రం చేశారని తెలిపారు.ప్రత్యేక శిబిరానికి ఇవాళ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ ఎం శ్రద్ధానందం మరియు కె.విశ్వనాథంలు సందర్శించారు.


