జనం న్యూస్ 11 ఫిబ్రవరి, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్
విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బెట్టు షాపుపై పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎస్ఐ ప్రమీలా దేవికి అందిన సమాచారం మేరకు గాజులరేగ అగురువీధికి చెందిన కల్లేపల్లి రమేశ్ లైసెన్స్ లేకుండా మద్యం అమ్ముతున్నట్టు గుర్తించారు.రైడ్ చేసి 41 మద్యం సీసాలను సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు. తదుపరి చర్యల నిమిత్తం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు.


