Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్సలికినీడి నాగు ఫిబ్రవరి 11 సెల్ 9550978955

కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వినతిపిల్లలు, యువత భద్రత దృష్ట్యా సోషల్ మీడియా వినియోగంలో వయోపరిమితి నియంత్రణపై సమగ్ర విధానం, చట్టపరమైన వ్యవస్థను తీసుకురావాలని, అధ్యయనం చేయటానికి ప్రత్యేక కమిటీ లేదా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని, ఇది ప్రస్తుతం తీవ్రమైన అంశమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు కృష్ణ దేవరాయలు ఈరోజు ఢిల్లీలో కలసి విన్నవించారు. దేశంలో 14–16 ఏళ్ల మధ్య పిల్లల్లో దాదాపు 90% మంది ఇంటిలో స్మార్ట్‌ఫోన్‌లకు అత్తుకుపోతున్నారు, వారిలో 75% కంటే ఎక్కువ మంది వినోద ప్రయోజనాల కోసం సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. 60% కంటే ఎక్కువ మంది మైనర్లు ఆన్‌లైన్ వేధింపులకు, హానికర కంటెంట్‌కు గురవుతున్నారని, తగిన భద్రతా చర్యలు లేకుండానే పిల్లల డేటాను సేకరించి వాణిజ్యపరంగా వినియోగిస్తున్నట్లు, అలాగే యువతలో ఆందోళన, డిప్రెషన్, సైబర్ వేధింపులతో మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై ఆర్థిక సర్వేలు దేశవ్యాప్తంగా ఆందోళన కల్గిస్తున్నాయని వివరించారు. ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు అనేక దేశాలు ఇప్పటికే చట్టపరమైన చర్యలు ప్రారంభించాయని,, ఆస్ట్రేలియా 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం అమలు చేయగా, డెన్మార్క్, మలేషియా, నార్వే, యూకే, న్యూజిలాండ్ దేశాలు కూడా చర్యలు చేపట్టబోతున్నాయని ఇది సోషల్ మీడియా పై నిఘా ఉంచాలనే దానికి అంతర్జాతీయ అవగాహనకు సంకేతమని,ఈ సందర్భంగా, సోషల్ మీడియా (వయోపరిమితి, ఆన్‌లైన్ భద్రత)పై కృష్ణ దేవరాయలు ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును వారికి వివరిస్తూ ఆ బిల్లులో సోషల్ మీడియా వాడకానికి కనీస వయోపరిమితి నిర్ణయించడం, తప్పనిసరి వయస్సు ధృవీకరణ విధానం అమలు చేయడం, ధృవీకరణ సమయంలో సేకరించిన పిల్లల వ్యక్తిగత డేటాను శాశ్వతంగా తొలగించడం, అలాగే నిబంధనలు ఉల్లంఘించిన ప్లాట్‌ఫారమ్‌లపై కఠిన చర్యలు, జరిమానాలు విధించడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయని చొరవ చూపి చర్యలు తీసుకోవాలని, ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా ఈ నియంత్రంణ విధానంపై కఠినంగా ఉన్నట్లు వివరించారు.