Listen to this article

జనంన్యూస్. 11.నిజామాబాదు.శ్రీనివాస్ పటేల్.

ఓటు హక్కు వినియోగించుకున్న అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ దంపతులు
మరో రెండు రోజుల్లో వెలువడనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలలో అత్యధిక మెజారిటీ స్థాయిలో ఇందూరు మున్సిపల్ కార్పొరేషన్ పై భాజపా జెండా ఎగరబోతుందని అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు పేర్కొన్నారు. బుధవారం జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఎమ్మెల్యే గారి దంపతులు నగరంలోని హరిచరణ్ మార్వాడి పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలలోకి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ఇందూరు-మన మేయర్ నినాదంతో ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముందుకెళ్లిన భారతీయ జనతా పార్టీ కి నగరంలోని అన్ని డివిజన్ లోని ప్రజలు భాజపాకు మద్దతు తెలిపారని ఆయన అన్నారు. మెజారిటీ స్థాయిలో అన్ని డివిజన్ లలో ప్రజలు కమలం పువ్వు కు ఓటు వేసి పార్టీ తరఫున నిలిచారని ఆయన అన్నారు. అదేవిధంగా బిజెపి పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.