Listen to this article


జనం న్యూస్ ఫిబ్రవరి 10 : విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : అధ్యాత్మిక చక్రవర్తి హుజూర్‌ హజరత్‌ సయ్యద్‌ బాబా ఖాదర్‌ వలీ 66వ ఉరుసు సుగంధ మహోత్సవం ఆదివారం అత్యంత వైభవోపేతంగా జరిగింది. వేలాది మంది భక్తులు ఈ ఉరుసు ఉత్సవంలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో పట్టణంలోని ఖాదర్‌ బాబా దర్గా దర్బార్‌ జన సంద్రంతో నిండిపోయి పండగ శోభను సంతరించుకుంది. దర్గాలో గల ఖాదర్‌ బాబా వారి దివ్య సమాధికి చాదర్‌, అత్తరు, గులాబీలు సమర్పించుకుని ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.