Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 11 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

సీనియర్ ఆర్టిస్ట్ లయ టైటిల్ రోల్ దరిస్తున్న రాగా మూవీస్” S/o కనకదుర్గమ్మ సినిమా షూటింగ్ ఈరోజు పాడేరు మోదకొండమ్మ దేవాలయం లో ప్రారంభం జరిగిందని సహ నిర్మాత దాడి శంకరావు తెలిపారు. ముహూర్తం షాట్ హీరో అనురూప్, హీరోయిన్ ఆకాంక్ష మరియు , ప్రధాన భూమికను పోసిస్తున్న కాకర్ల గోవర్ధన్ ల పైన చిత్రీకరణ జరిగింది.దీనికి కెమెరా స్విచ్ ఆన్ రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమి చైర్మన్, జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్ దాక్టర్ వంపూరు గంగులయ్య మరియు రాష్ట్ర వినియోగదారుల హక్కుల సంస్థ అధ్యక్షులు, కొత్తవలస మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కనకాల శివ క్లాప్ కొట్టి ప్రారంభించారు. పాడేరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడు కొబ్బరికాయ కొట్టి యూనిట్ సభ్యులకు శుభాశీసులు అందజేశారు. అమ్మవారి పాత్రలో సీనియర్ నటి లయ, స్క్రీన్ ప్లే దర్శకత్వం దుర్గాపనిధర్, నిర్మాత నిర్వహణ రామకోటి శశిధర్, సహ నిర్మాత దాడి శంకర్రావు, షూటింగ్ చిత్రీకరణలో పాల్గొన్నారు.//