Listen to this article


జనం న్యూస్ 10 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : 104 ఉద్యోగుల్లో అర్‌ఈపీలు సవరణ చేసి, ఉద్యోగులకు న్యాయం చేయాలని CITU జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేశ్‌ డిమాండ్‌ చేశారు. విజయనగరంలో ఆదివారం CITU కార్యాలయంలో 104 ఉద్యోగులు సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్‌లో 104 డ్రైవర్‌ డి.ఇ.ఓలుగా పనిచేస్తు ప్రజలకు సేవ చేస్తున్నరని అంటువంటి వారి జీవితాలతో ఆడుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. వారి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరారు.