Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఫిబ్రవరి 12

తర్లుపాడు: అఖిల భారత సమ్మెలో భాగంగా తర్లుపాడు మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు నాయకులు జిల్లా ఉపాధ్యక్షులు బాలనాగయ్య నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, వి.ఏ.ఓ లు, మరియు ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు మరియు కార్మికులు ప్రభుత్వం ముందు పలుకీలకడిమాండ్లనుఉంచారు,కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న కొత్త లేబర్ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి.పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల కనీస వేతనాన్ని రూ. 26,000 కు పెంచాలి.క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీ, ఆశా మరియు వి.ఏ.ఓలకు పూర్తిస్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలి. పదవీ విరమణ చేసిన తర్వాత కార్మికులకు సామాజిక భద్రతలో భాగంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలి.గ్రామ వీధుల్లో నిరసన తెలిపిన అనంతరం, నాయకులు మరియు కార్మికులు కలిసి స్థానిక తహసీల్దార్ కేకే కిషోర్ కుమార్ గారిని కలిశారు. తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయనకు అందజేస్తూ, ప్రభుత్వం స్పందించి తక్షణమే సమస్యలనుపరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘము నాయకులు ఎర్వ పాపిరెడ్డి, సి ఐ టి యూ సెక్రటరీ పార్వతమ్మ, మేకల హనుమాంజలి, అంగన్వాడీ కార్యకర్తలు నాశరమ్మ, పద్మావతి, లలిత, అచ్చమ్మ, శివ, వి ఏ ఓ లు మల్లేశ్వరి,ఆశ వర్కర్స్ నాగలక్ష్మి, రాజకుమారి తదితరులు పాల్గొన్నారు