Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపీఎస్
జనం న్యూస్ 10 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : నేరాలు కట్టడికి జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది విధిగా ప్రతీ రోజూ విజిబుల్ పోలీసింగు నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ వకీల్ జిందల్ ఫిబ్రవరి 9న ఆదేశించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – నేరాలు కట్టడికి, తగ్గుముఖం పట్టేందుకు విజిబుల్ పోలీసింగు ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. ప్రతీ రోజూ సాయంత్రం పోలీసు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా తమ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. ప్రజలు, యువత, వాహనదారులకు రహదారి భద్రత, మహిళల భద్రత, సైబరు భద్రత, మాదక ద్రవ్యాల నియంత్రణ పట్ల అవగాహన కల్పించాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే ఎటువంటి శిక్షలు విధించబడతాయి, నేరాలకు పాల్పడడం వలన అవి జీవితం, కుటుంబంపై చూపే దుష్ప్రభావాలను వివరించాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే ఉపేక్షించవద్దని, వారిపై చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నివసించే హిస్టరీ షీట్లు కలిగిన వ్యక్తులను వారంలో ఒకసారి పోలీసు స్టేషన్ కి పిలిపించి, సత్ప్రవర్తనతో వారు జీవించే విధంగా కౌన్సిలింగ్ చేయాల న్నారు. ప్రస్తుతం వారు ఏవిధంగా జీవిస్తున్నది, నేర ప్రవృత్తి ఏవిధంగా ఉన్నది అన్న అంశాల పట్ల నిఘా ఏర్పాటు చేయాలన్నారు.
క్షేత్ర స్థాయిలో ప్రజలకు రక్షణగా నిలిచే చట్టాల పట్ల, ప్రజలను దోచుకునేందుకు సైబర్ మోసగాళ్లు అవలంభించే వివిధ విధానాలను ప్రజలకుం తెలియపర్చి, ఆ తరహా మోసాలకు గురి కాకుండా అప్రమత్తం చేయాలన్నారు. అంతేకాకుండా, జిల్లా పోలీసుశాఖ ప్రత్యేకంగా రూపొందిస్తున్న షార్ట్ ఫిల్మ్స్ ను ప్రదర్శించి, వారికి అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అధికారులను ఆదేశించారు.