Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 12,అచ్యుతాపురం:

లేబర్ కోడ్ లు,రైతు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అచ్యుతాపురంలో ఈరోజు కార్మికులకు ఉరి అనే వినూత్న కార్యక్రమం భారీ ర్యాలీ,సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ రాము, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రి అప్పారావు, కౌలు రైతు సంఘం నాయకులు కే రామ సదాశివరావు, మండల కన్వీనర్ కే సోము నాయుడు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ లు రద్దయ్యేంతవరకు పోరాడుతామని,కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని రైతులు పండించే పంటలుకు గిట్టుబాటు ధర కల్పించి నూతన విద్యుత్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి నాయకులు నారాయణమ్మ వరలక్ష్మి సత్యవతి,ఆశా యూనియన్ నాయకులు ఉమ్మడి దేవుడమ్మ మంగమ్మ ,వీఆర్ఏ నాయకులు శివలింగ కృష్ణ గాలి పరదేశి నాయుడు, ప్రైవేట్ స్కూల్స్ నాయకులు బొడ్డెడ రామ్ కుమార్ , కౌలు రైతు సంఘం నాయకులు శరగడం రామనాయుడు,ఆటో యూనియన్ నాయకులు కర్రినాయుడు తట్టా రాజు ,ఐకెపి నాయకులు లావణ్య దేవి, పంచాయతీ కార్మికులు శ్రీరాములు నాగమణి,సెజ్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.