Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 12 అనకాపల్లి జిల్లా రిపోర్టర్ కృష్ణ

ప్రైవేట్ ర్యాపిడొ, ఓలా, ఉబర్ తరహా యాప్ లనురద్దు చేసిప్రభుత్వం యాప్ లను ఏర్పాటు చేయాలనీ ఆంధ్రప్రదేశ్ ఆటో డ్రైవర్స్ &వర్కర్స్ ఫెడ రేషన్ ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు కోన లక్ష్మణ డిమాండ్ చేశారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె లో భాగంగా ఆటో కార్మికులు స్థానిక చోడవరం బస్ స్టాప్ నుంచి 4రోడ్లు వరకు ర్యాలీ నిర్వహించి అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లెబర్ కోడ్లను రద్దు చేయాలనీ,ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆటో ఫెడ రేషన్ జిల్లా రిపోర్టర్ అధ్యక్షులు, కార్యదర్శి లు పెద్దిరెడ్ల నాగేశ్వర రావు, కోరిబిల్లి జగదీష్ మాట్లాడుతూ* ర్యాపిడొ లో వైట్ బోర్డు అర్హత కల్గిన 2 వీలర్స్ నీ రద్దు చేయాలి.జీవో 21 రద్దు చేయాలని.ఆర్.టి.ఓ. ఆఫీసులో ఎఫ్.సి. పాత పద్దతి కొనసాగించాలి.ఎ.టి.ఎస్ సెంటర్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు, కార్యక్రమం లో ఓ. వెంకటేష్(నాగ ) రాపుటి పెంటరావు,వైచంద్ర, రామారావు, గణేష్ గంగిరెడ్ల. గోవింద్, తలారి మంగ నాయుడు, దుర్గ రావు, రామారావు, కరణం శ్రీను, వెంకటేష్, జై చంద్ర, జగన్,సురేష్, రాజా తదితరులు పాల్గొన్నారు/