జనంన్యూస్. 12.సిరికొండ.శ్రీనివాస్ పటేల్.
నిజామాబాదు రురల్ మండల కేంద్రం సిరికొండ సర్పంచ్ మల్లెల సాయిచరణ్ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలో చాలా సంవత్సరాల నుంచి లో వోల్టేజ్ సమస్య, ఏబి కేబుల్ ఉన్నచోట థర్డ్ వైర్ బిగించుట పూర్తిగా ఇండ్ల మధ్యలో ప్రమాదకరంగా ఉన్న 33 కెవి కరెంటు లైన్ ఊరికి అవతల వైపు వేయుటకు మెయిన్ రోడ్డుకు ఇరువైపులా కామారెడ్డి రోడ్డు చర్చి నుండి దొండ్ల వాగు వరకు రెండు వైపులా పోల్స్ వేస్తూ కరెంటు లైన్ వేయుటకు సిరికొండ ఎలక్ట్రిసిటీ ఏఈ శేఖర్ ని కలసి ఈ సమస్యలు అన్ని పరిష్కరించుటకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు కనగందుల మురళి, చిట్యాల రంజిత్,బాదావత్ తిరుపతి , నాయకులు కొలిప్యాక సుమన్, బోల్గం శివకుమార్, తదితరులు పాల్గొన్నారు



