Listen to this article

జనం న్యూస్ 10 ఫిబ్రవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్ : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రజ్ఞా వికాసం పేరుతో మోడల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. ప్రశ్నాపత్రాలను 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ శ్రీనివాస్ గారు, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మోహన్ గారు, జిల్లా కార్యదర్శి సి.హెచ్ వెంకటేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దెశించి సిఐ గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ రానున్న పబ్లిక్ పరీక్ష కోసం ప్రణాళిక బద్ధంగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని తెలియజేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్మోహన్ మాట్లాడుతూ మొదటిసారి రాయపోయే 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్ విద్యార్థులకు ఇది ఒక మోడల్ ఎగ్జామ్ గా ఉంటుందని, విద్యార్థుల్లో ఉండే భయాన్ని పోగొడుతుందని అన్నారు. సిహెచ్ వెంకటేష్ గారు మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు దగ్గర పడిన కారణంగా మొబైల్స్, టీవి, సినిమాలు కు దూరంగా ఉండి ప్రణాళిక బద్ధంగా చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. నేడు జరుగుతున్న ఎస్ఎఫ్ఐ మోడల్ టెస్టుల్లో ప్రధమ ద్వితీయ తృతీయ స్థాయిలో మార్కులు సాధించిన వాళ్ళకి నగదు బహుమానం 5000, 3000, 2000 చొప్పున అందించడం జరుగుతుంది అన్నారు. మండల స్థాయిలో ప్రథమ ద్వితీయ తృతీయ స్థాయిల్లో మార్కులు సాధించినవారికి జ్ఞాపికలు ఇవ్వడం జరుగుతుంది. అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాము, సహాయ కార్యదర్శి రవి, జిల్లా నాయకులు రాజు, సూరిబాబు ,సమీరా, జయ ఎర్రమ్మ ఇతర నాయకులు పాల్గొన్నారు.