Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 12,అచ్యుతాపురం:

ప్రభుత్వ బడిలో విద్యార్థులను చేర్పిద్దాం ఊరి బడిని కాపాడుకుందామని,ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకోవడం ఒక సామాజిక అవసరం అని యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఉప్పాడ రాము, రాష్ట్ర కౌన్సిలర్ మారిశెట్టి వెంకట అప్పారావు అన్నారు. గురువారం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొండకర్లల్లో యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో ఊరుబడిని కాపాడుకోవడం కోసం రూపొందించిన గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరానికి ముందుగానే ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి, ఊరి బడిలో విద్యార్థులంతా చేరేలా కార్యక్రమాలు నిర్వహించి గ్రామాల్లో అవగాహన కల్పించాలని కోరారు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ బడులు వరంగా మారాయని పేర్కొన్నారు. ప్రైవేట్‌ పాఠశాలల మోజులో పడి ప్రభుత్వ బడులను నిర్లక్ష్యం చేయకుండా, ప్రతి తల్లిదండ్రుడు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె శ్రీనివాసరావు, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.