Listen to this article

జనం న్యూస్, ఫిబ్రవరి 12,అచ్యుతాపురం:

దోసూరు గ్రామంలో లోగల శ్రీ స్వయంభు సోమలింగేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రావిపాలెంకు చెందిన కర్రి శ్రీనివాసరావు కుమారుడు కర్రి శేఖర్ ఆలయ కమిటీ సభ్యులు నర్మాల రామకృష్ణకు రూ. లక్ష నగదును విరాళంగా అందజేశారు.ఆలయ అభివృద్ధికి ఇలా విరాళాలు అందించడం అభినందనీయం అని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ సందర్బంగా శేఖర్ మాట్లాడుతూ ఆలయం అభివృద్ధి పనుల నిమిత్తం అందరూ విరాళాలు అందించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.