

జనంన్యూస్. నిజామాబాదు. ప్రతినిధి నిజామాబాదు. సిరికొండ.స్వాదేశస్థులకు బేడీలు వేసిన స్పందించని మోడీ సిపిఐ(ఎం ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ.కార్యదర్శి ఆర్. రమేష్ భారతీయులకు బేడీలు వేసి పంపిస్తున్న ట్రంప్ దురహంకార చర్యల్ని ఖండించాలని, స్వదేశస్థులకు ట్రంప్ బేడీలు వేసిన స్పందించని మోడీ చర్యలు సిగ్గు చేటని సిపిఐ(ఎం ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్.తీవ్రంగా విమర్శించారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సిపిఐ(ఎం ఎల్) మాస్ లైన్ మండల కమిటీ ఆధ్వర్యంలో భారతీయులను నేరస్తులుగా చెప్పి యుద్ధకైదిలను ట్రీట్ చేసినట్లు చేతులకు, కాళ్లకు బేడీలు వేసి అమెరికా అధ్యక్షులు ట్రంప్ దురఅహంకారపూరిత చర్యలను ఖండిస్తూ ట్రంప్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్బంగా సిపిఐ (ఎం ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్. రమేష్ మాట్లాడుతు : ప్రపంచ దేశాల ప్రజల్ని అమెరికా అధ్యక్షులు ట్రంప్ అవమాన పరుస్తూ, ఆత్మ భిమానం దెబ్బతి నెలాగా జులుం ప్రదర్శించడం సిగ్గు చేటు అన్నారు. ప్రపంచ దేశాలు ట్రంప్ చర్యలను వ్యతిరేకిస్తు నిరసన తెలుపుతుంటే మన దేశప్రధాని మోడీ మాత్రం మౌనం వహిస్తూ ట్రంప్ కు మద్దత్తు ఇవ్వడం శోచనీయం అన్నారు. ఎన్నికల్లో ట్రంప్ గెలుపు కోసం మద్దుత్తు ఇచ్చినందుకు మోడీకి ట్రంప్ ఇలా షాక్ ఇచ్చాడని అన్నారు. భారతీయ పౌరులను అవమానంకు గురిచేసిన బిజెపి పార్టీ ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. తోటి హిందువులకు తీవ్రమైన అవమానం జరిగిన స్పందించక పోవడం దగకోరు తనమే అవుతుంది అన్నారు. హిందువుల కోసమే పనిచేస్తున్నామంటున్న ప్రధాని మోడీ హిందువులపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ చేస్తున్న అకృత్యాలను ఖండించక పోవడం తన నకిలీ హిందుత్వాన్ని తెయలియజేస్తుంది అన్నారు. అమెరికా అధ్యక్షులు ట్రంప్, భారత ప్రధాని మోడీ ఇద్దరు తోడుదొంగలే అని వీరి మత వాద కుట్రలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలని ఆయన పిలుపును ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఐ (ఎం ఎల్) మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్. దామోదర్, మండల నాయకులు ఎం. లింబాద్రి, బి. కిశోర్, ఇ. రమేష్, ఎస్. కిశోర్, కె. ఆశిస్, ఏ. సాయిలు తదితరులు పాల్గొన్నారు.