Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 12 2026 ( ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ )

ఎల్కతుర్తి….. కూలి పెంచాలి మిగులు భూమిని పంచాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గుమ్మడి రాజుల రాములు ఆధ్వర్యంలో, గురువారం పుచ్చలపల్లి సుందరయ్య భవన్ నుండి, అంబేద్కర్ విగ్రహం వరకు, బస్టాండ్ నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి తూట్లు పొడవడానికి కొత్త పథకం తీసుకువచ్చిందన్నారు. పాత పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి ₹200 రోజులు పని కలిపించి, సరైన కూలి నివ్వాలన్నారు. మిగులు భూములను పేద ప్రజలకు పంచాలని విజ్ఞప్తి చేశారు. తాసిల్దార్ ప్రసాదరావుకు వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట జిల్లా కార్యవర్గ సభ్యురాలు అంబాలస్వరూప, లోకిని స్వరూప, షణ్ముఖం, రాధా, సంధ్యారాణి, రజిత, తదితరులు పాల్గొన్నారు.