Listen to this article

జనం న్యూస్, 12 ఫిబ్రవరి, కొల్లూరు గ్రామం, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.
( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి,చింతలగట్టు నర్సిములు )

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం లోని, ఝరాసంగం మండల పరిధిలోని, కొల్లూరు గ్రామంలో, సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, తన సొంత డబ్బులతో, ఉపాధి హామీ కూలీలకొరకు, రాగి జావాను చేయించి, వారికి అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, ఉదయం పూట ఉపాధి హామీ పనిని ఆరంభించి, ఎండ తగలక ముందే, పనిని ముగించాలని, కూలీలందరూ ఆరోగ్యంగా ఉండాలని, రాగి జావాను త్రాగడం వల్ల శరీరానికి ఎంతో బలాన్ని చేకురుస్తుందని, ఔషధం లాగా పని చేస్తుందని తెలిపారు. గ్రామ ప్రజలందరి క్షేమాన్ని కోరి, తాను ఈ పనిని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.