Listen to this article

జనం న్యూస్ ఫిబ్రవరి 13 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో

వ్యవసాయ రైతు వ్యతిరేక విధానాలు నశించాలి

దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం

_ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు శేఖర్.

కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలకు నశించాలి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించాలని రైతాంగ సమస్యను పరిష్కరించాలని ప్రజా నాట్య మండలి జిల్లా అధ్యక్షులు శేఖర్ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం చిలిపచేడ్ మండల కేంద్రం లో సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె సందర్భంగా ఎం ఆర్ ఓ కార్యాలయం నుండి నర్సాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దుచేసి తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల ను కారు చౌకగా కార్పొరేట్ శక్తులకు అమ్ముతూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతున్నారని ఆరోపించారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని ఉపాధి హామీ చట్టాన్ని కాపాడాలని విభజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన విత్తన విద్యుత్ సవరణ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీ కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్, వివోఏ, ఆశ వర్కర్స్, మధ్యాహ్నం భోజనం, భవన నిర్మాణ,హమలి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని వారికి కనీస వేతనం 26000 నిర్ణయించాలని ఆశలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి వేతనాలు ఇవ్వాలని సెర్ఫ్ ద్వారా కనీస వేతనం నిర్ణయించి ఇవ్వాలని అన్నారు, గ్రామపంచాయతీ కార్మికులు పాల్గొన్నారు